Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

17-08-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

నాగదేవతలకు ప్రత్యేక పూజలు.. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి

న్యాల్కల్, ఆగస్టు 17:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని

శ్రావణ మాస శుక్లపక్ష నాగుల పంచమి సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలో సోమవారం నాగుల పంచమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత విగ్రహాలు, పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పసుపు, కుంకుమ సమర్పించి నాగదేవతలకు అభిషేకాలు నిర్వహించారు. వివిధ నైవేద్యాలు సమర్పించి కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.ఈ ఏడాది నాగుల పంచమి శ్రావణ సోమవారం రోజున రావడంతో పండుగకు మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. న్యాల్కల్‌లోని స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు

నిర్వహించారు.ఆలయానికి భక్తులు, మహిళలలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల, వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది.పండుగ సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగడంతో న్యాల్కల్ మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Sthanikam

న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News