Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:44 AM

డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం

04-05-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

న్యాల్కల్ మండల కేంద్రంలోని డప్పూర్ గ్రామ శివారులో వెలసిన శ్రీ బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహోత్సవంలో గ్రామ ప్రజలు, కురుమ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహోత్సవం సందర్భంగా గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. మహిళలు బోనాలు, కలశాలతో పాల్గొనగా, డోలు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించి ఆశీస్సులు పొందారు. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.ఈ వేడుక ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ప్రత్యేక మహోత్సవంగా గ్రామంలో విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కలిసి సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించారు. బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణం కురుమల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించింది.ఈ కార్యక్రమం కురుమ సంఘం అధ్యక్షులు శివరాజ్, పుండికూర రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్థానికులు మాట్లాడుతూ, తరతరాలుగా ఈ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.

Sthanikam

డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News