Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:42 AM

గుడిపల్లి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ బీకే పార్థసారథి

07-04-2026 288 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి వారి 101వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాలకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూజలు జరిపి తీర్థప్రసాదాలను అందించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనపై స్థానిక నాయకులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Sthanikam

గుడిపల్లి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ బీకే పార్థసారథి

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి వారి 101వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాలకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూజలు జరిపి తీర్థప్రసాదాలను అందించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనపై స్థానిక నాయకులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News