Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:19 PM

చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి

16-03-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: తోగట వీర క్షత్రియుల ఆరాధ్య దైవం అయిన శ్రీ చౌడేశ్వరి మాత పంచమ జ్యోతి మహోత్సవం ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున సోమందేపల్లిలో జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం చౌడేశ్వరి దేవి ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీసీ ఈశ్వరయ్య ఎస్ఐ రమేష్ బాబును కలిసి ఆహ్వానించారు.

ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ జ్యోతి మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమానికి ఎస్ఐ రమేష్ బాబు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహోత్సవానికి తగిన బందోబస్త్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జ్యోతి సంఘం అధ్యక్షుడు బండారు శీనా తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి

Article Image

సోమందేపల్లి: తోగట వీర క్షత్రియుల ఆరాధ్య దైవం అయిన శ్రీ చౌడేశ్వరి మాత పంచమ జ్యోతి మహోత్సవం ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున సోమందేపల్లిలో జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం చౌడేశ్వరి దేవి ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీసీ ఈశ్వరయ్య ఎస్ఐ రమేష్ బాబును కలిసి ఆహ్వానించారు.

ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ జ్యోతి మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమానికి ఎస్ఐ రమేష్ బాబు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహోత్సవానికి తగిన బందోబస్త్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జ్యోతి సంఘం అధ్యక్షుడు బండారు శీనా తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News