Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆందోల్‌ మైసమ్మ క్షేత్రంలో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 08:00 PM

భారీ వర్షంతో గోడలు, పైకప్పు కూలిన ఇల్లు.. బాధితులను పరామర్శించిన సర్పంచ్

భారీ వర్షంతో గోడలు, పైకప్పు కూలిన ఇల్లు.. బాధితులను పరామర్శించిన సర్పంచ్

భారీ వర్షంతో గోడలు, పైకప్పు కూలిన ఇల్లు.. బాధితులను పరామర్శించిన సర్పంచ్
August 01, 2026 05:42 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని ముర్కుంజాల్ గ్రామం 8వ వార్డులో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గైని శరణప్పకు చెందిన ఇల్లు గోడలు, పైకప్పు తడిసి కూలిపోయాయి. ఈ ఘటనతో ఆయన కుమారులు గైని తుకారాం, గైని యాదయ్య కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వర్షాల కారణంగా ఇళ్లు కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అండగా నిలవాలని, ఇళ్ల మంజూరులో వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే, ఎంపీలను కోరారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, కిష్టయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News