రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం.. సకాలంలో మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది.
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్డులో గల టీచర్స్ కాలనీలోని హెచ్‌ఆర్ ఈవీ మోటార్స్ షోరూంలో సోమవారం షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో షోరూంలో ఉన్న నాలుగు ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
షోరూం నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నివారించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి