హైదరాబాద్ నుంచి వస్తుండగా కైతాపురం స్టేజీ వద్ద ప్రమాదం
వేగంగా వచ్చిన లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రగాయాలై ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపురం స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన బద్రి రాహుల్ (23) హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. గ్రామంలో బోనాల పండుగ ఉండటంతో తన టీవీఎస్ రైడర్ ద్విచక్రవాహనం (TG 03 BA 2595) పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో కైతాపురం స్టేజీ వద్దకు చేరుకోగానే వెనుక వైపు నుంచి అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం (GJ 27 TT 7465) బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాహుల్ రహదారిపై పడిపోవడంతో తల వెనుక భాగంలో బలమైన తీవ్ర రక్తగాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాగేంద్ర ప్రతాప్ పటేల్‌గా గుర్తించారు. మృతుడి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి