పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, డి.ఎస్.పి అధ్యక్షతన పీస్ కమిటీ (శాంతి కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్‌పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, పోలీసుల సూచనలు పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు ఆమె సూచించారు. సమిష్టి సహకారంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్‌డివో వి.శేఖర్ రెడ్డి, డిఎస్పీ మధుసూదన్ రెడ్డి, కమిషనర్ ఎన్.వెంకటేశ్వర నాయక్, సిఐ మన్మధ కుమార్, 2వ వార్డు కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, నాయకులు చింతల సాయిలు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రులు: పీస్ కమిటీ పిలుపు

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి