నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని నాగుర్-కె ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బెల్టులు, షూస్ పంపిణీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మహానంద, ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానంద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. బడిఈడు వయస్సు ఉన్న ప్రతి చిన్నారిని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, షూస్, పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు గుడ్లు అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, విజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య.. విద్యార్థులకు ఉచిత దుస్తులు, షూస్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి