గ్రామాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా ఎస్‌ఐఆర్ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ కోరారు. బుధవారం మానూర్ మండలంలోని మాయికోడ్ గ్రామంలో సర్వేకు సంబంధించిన ఫారాలను పరిశీలించిన ఆమె, ఓటరు జాబితాలో పేర్లు లేదా వివరాల్లో తప్పులు ఉన్నవారు సవరణ కోసం అవసరమైన ఆధార పత్రాలను స్థానిక బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో గ్రామస్తులు బీఎల్‌ఓలకు పూర్తి సహకారం అందించి, అవసరమైన వివరాలను త్వరగా అందించాలని కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ కర్ణం కృష్ణ మానూర్ వద్ద వాగుపై కల్వర్టు నిర్మాణం పూర్తి చేయాలని డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె కల్వర్టు నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరయ్యాయని, కాంట్రాక్టు ఎవరైనా ముందుకు వచ్చిన వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణుసాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ శంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, అంగన్‌వాడీ టీచర్లు కాశమ్మ, సంధ్యారాణి, గ్రామస్తులు శరణప్ప, చంద్రకాంత్, బసుగొండ తదితరులు పాల్గొన్నారు.
సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి