దివిస్, గాయత్రి కళాశాలలో పోలీసుల సదస్సు
యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీ సూచనల మేరకు స్థానిక ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం దివిస్ పరిశ్రమతో పాటు శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నందగిరి వెంకటేశం మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో కార్మికులు, విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి