గాంధీ పార్కు వద్ద డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో భారీ మానవహారం
తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం స్థానిక గాంధీ పార్కు ఆవరణలో చౌటుప్పల డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన "మానవహారం" కార్యక్రమం విజయవంతమైంది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ గౌరవ అధ్యక్షులు బత్తుల శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి రావలసిన సుమారు 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల నిర్వహణ, విద్యావ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారకముందే ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాళ్లు విష్ణు కుమార్, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు, దుర్గయ్య, అధ్యాపకులు రవి, లింగస్వామి, సైదులు, బాలరాజు, సంతోష్, హరికృష్ణ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి