Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్ న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 04:54 PM

మండపాల వద్ద సీసీ కెమెరాలు.. రాత్రివేళ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి. వలిగొండ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి.

09-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి.

ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దు.. డీజేలపై నిబంధనలు పాటించాలి.

వలిగొండ, సెప్టెంబర్‌ 8: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని వలిగొండ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. గణేష్‌ మండపాల ఏర్పాటుకు ముందుగా పోలీస్, విద్యుత్, మున్సిపల్‌ లేదా గ్రామపంచాయతీ శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని కోరారు.

రహదారులకు అడ్డంగా మండపాలు వద్దు

వాహనాలు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయరాదని ఎస్‌ఐ తెలిపారు. అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

డీజేలపై నిబంధనలు.

ధ్వని కాలుష్యానికి కారణమయ్యే విధంగా మైకులు, డీజేలను వినియోగించరాదని సూచించారు. రాత్రి వేళల్లో నిర్దేశిత సమయం దాటిన తర్వాత శబ్ద పరికరాలను వినియోగించకూడదని, అమలులో ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మండపాల వద్ద సీసీ కెమెరాలు

ప్రతి గణేష్‌ మండపం వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. రాత్రి వేళల్లో మండపం వద్ద కనీసం ఇద్దరు లేదా ముగ్గురు నిర్వాహకులు ఉండి భద్రతను పర్యవేక్షించాలని తెలిపారు.

శోభాయాత్రలో అప్రమత్తంగా ఉండాలి.

నిమజ్జనం సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్‌ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

Sthanikam

మండపాల వద్ద సీసీ కెమెరాలు.. రాత్రివేళ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి. వలిగొండ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News