Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముర్కుంజాల్ పాఠశాలలో అవ్యవస్థలు.. ఉపాధ్యాయుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 01:19 PM

ముర్కుంజాల్ పాఠశాలలో అవ్యవస్థలు.. ఉపాధ్యాయుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం

09-09-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు పాఠశాల బయట, ప్రధాన రోడ్డుపై తిరుగుతున్నారని గ్రామ సర్పంచ్ సారంగి అనూష ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సర్పంచ్ సారంగి అనూషతో పాటు సాయ గౌడ్ పాఠశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కనీస ప్రాథమిక విద్య కూడా సక్రమంగా అందడం లేదని, అ, ఆ, ఇ, ఈ వంటి అక్షరాలను కూడా సరిగా చదవలేని పరిస్థితి ఉందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధ్యాయులు బాధ్యతగా విధులు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. పాఠశాల సమస్యలపై డీఓ, ఎంఈఓలకు పలుమార్లు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాల్సిన పండ్లు, గుడ్లు, బిస్కెట్లు వంటి పౌష్టికాహారం కూడా సక్రమంగా అందడం లేదని తెలిపారు. విద్యార్థుల భద్రత, విద్య, పౌష్టికాహారంపై అధికారులు తక్షణమే దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ సారంగి అనూష డిమాండ్ చేశారు.

Sthanikam

ముర్కుంజాల్ పాఠశాలలో అవ్యవస్థలు.. ఉపాధ్యాయుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News