పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య.. కుటుంబంలో విషాదం.
చండూరు: పత్తి పంట పూర్తిగా ఎండిపోవడంతో పెట్టుబడి నష్టం తప్పదన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలంలో చోటుచేసుకుంది.
అంగడిపేటకు చెందిన పనస రాములు (55) సోమవారం తన పొలానికి వెళ్లాడు. పత్తి పంట ఎండిపోయి చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పొలంలోనే పురుగుల మందు తాగాడు.
సాయంత్రం అయినా రాములు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
రైతు మృతితో అంగడిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చే దశలో పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతు ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి