Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బడి రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 09:57 PM

బడి రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థులు

బడి రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థులు

బడి రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థులు
07-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రూ.20 వేల విలువైన ఫర్నిచర్‌ విరాళం.. 2008–09 బ్యాచ్‌ ఆదర్శం.

పేరేపల్లి:

తాము అక్షరాలు దిద్దుకున్న బడిని మరువకుండా.. చదువు నేర్పిన పాఠశాల అభివృద్ధికి తమ వంతు చేయూతనందించారు పూర్వ విద్యార్థులు. పేరేపల్లి MPUPS పాఠశాలలో 2008–09 విద్యా సంవత్సరంలో 7వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల బృందం ‘మేము సైతం పాఠశాల అభివృద్ధికి’ అంటూ ముందుకొచ్చింది.పాఠశాల అవసరాలను గుర్తించిన వారు సుమారు రూ.20 వేల విలువైన కంప్యూటర్‌ టేబుల్‌, స్టీల్‌ బీరువా, 10 కుర్చీలను విరాళంగా అందజేశారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకరించడం పట్ల పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

ఉన్నత స్థాయికి ఎదిగినా చిన్ననాటి బడిని మరిచిపోకుండా సేవాభావంతో ముందుకొచ్చిన 2008–09 బ్యాచ్‌ విద్యార్థినీ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. వారి చొరవ ఇతర పూర్వ విద్యార్థులకు సైతం స్ఫూర్తిదాయకమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Sthanikam

బడి రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News