Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంగ్టిలో రాత్రివేళ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 01:53 PM

కంగ్టిలో రాత్రివేళ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి

07-09-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ వైద్యుడిని నియమించాలని కోరుతూ దేగుల్వాడి గ్రామానికి చెందిన మల్లా షేక్ అహ్మద్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాత్రి వేళల్లో అత్యవసర వైద్యం అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యం లేదా ప్రమాదం జరిగినప్పుడు రోగులను నారాయణఖేడ్‌కు తరలించాల్సి వస్తోందని తెలిపారు. దీంతో సమయం వృథా కావడంతో పాటు ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా పేద, సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కంగ్టి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ వైద్యుడిని నియమించి, 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందించేలా తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని తన వినతిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మల్లా షేక్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

కంగ్టిలో రాత్రివేళ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News