Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:53 PM

రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి

26-08-2026 329 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలో రాత్రివేళ అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టి.వై.జె.ఎఫ్. జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ జలీల్ కోరారు. రాత్రి సమయంలో అనారోగ్యం, ప్రమాదాలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా బాధ్యతగా వ్యవహరించి కనీసం ఒక ఆసుపత్రి రాత్రివేళ వైద్యులు, సిబ్బందితో అందుబాటులో ఉండేలా షిఫ్ట్ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు సమన్వయంతో పనిచేస్తే అత్యవసర సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా కంగ్టి మండల కేంద్రంలోనే 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని షేక్ జలీల్ కోరారు.

Sthanikam

రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News