Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్

Updated : 25 Aug 2026 21:08 IST
As Preferred Source 1 min read
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలంలోని గురుజువాడ గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ పిలుపునిచ్చారు.గ్రామంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు.గ్రామ పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని నిర్ణయించారు.నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు.మొక్కలు నాటడం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.‘‘పచ్చని గ్రామమే ఆరోగ్యకరమైన గ్రామం. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలి’’ అని ప్రియాంక రాజేందర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆనంద్ జిపిఓ వెంకటేష్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం ఆశ వర్కర్లు అనసూయ , సుమలత గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. గ్రామంలో మరిన్ని ప్రాంతాల్లో పచ్చదనం పెంచేలా నిరంతరం కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ తెలిపారు.

Sthanikam

మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news