Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:36 PM

వినూత్నంగా నీటి పంపిణీ నమూనాను అమలు చేస్తున్న REDS సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్

25-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్న ప్రస్తుత తరుణంలో రైతులు పక్కా ప్రణాళికతో నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.

మంగళవారం నల్లమడ మండలం గోపేపల్లి గ్రామంలో 'రెడ్స్' (REDS) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "కమ్యూనిటీ వాటర్ షేరింగ్" కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా గోపేపల్లికి చెందిన బోర్ వెల్స్ కలిగిన నలుగురు రైతులు — వేమన్న, భాస్కర్, రామకృష్ణ, నరసప్ప — నీటి వసతి లేని మరో 10 మంది పేద రైతులకు పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా సాగునీటిని అందించేందుకు ముందుకు రావడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...* వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అవగాహన రాహిత్యంతో ఇష్టం వచ్చినట్లు బోర్లు వేసి, నీళ్లు పడక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో బోర్ ఉన్న రైతులు సాగునీటి వసతి లేని తోటి రైతులతో నీటిని పంచుకోవడం శుభపరిణామమని, ఈ మోడల్‌ను జిల్లాలోని ఇతర గ్రామాల రైతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.బోర్లలో అందుబాటులో ఉన్న నీటితో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని, దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.పొలం ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా పంటలు సాగు చేయాలన్నారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ద్వారా ఉలువలు వంటి ప్రత్యామ్నాయ పంట విత్తనాలను సిద్ధం చేశామని తెలిపారు. రైతులు తమ పొలాల్లో వేసిన ప్రతి పంటను తప్పకుండా 'ఈ-క్రాప్' (e-Crop) లో నమోదు చేయించుకోవాలని స్పష్టం చేశారు.

పడే ప్రతి వర్షపు చుక్కనూ వడిసిపట్టేలా రైతులు తమ భూముల్లో వీలును బట్టి కచ్చితంగా నీటి కుంటలు (ఫార్మ్ పాండ్స్) తవ్వుకోవాలని పిలుపునిచ్చారు.సమావేశంలో పాల్గొన్న లబ్ధిదారులైన రైతులు కమ్యూనిటీ వాటర్ షేరింగ్ ద్వారా తమకు కలిగిన ప్రయోజనాలను, అనుభవాలను కలెక్టర్‌తో పంచుకున్నారు. కాగా, ఈ వినూత్న కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్న 'రెడ్స్' సంస్థ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో డిఎఒ కృష్ణయ్య,జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నవీన్,నల్లమడ తహసీల్దార్ మనోజ్,ఎంపిడిఓ అంజనప్ప,రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానుజ, మండల వ్యవసాయ అధికారి (AO), రెడ్స్ సంస్థ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

Sthanikam

వినూత్నంగా నీటి పంపిణీ నమూనాను అమలు చేస్తున్న REDS సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News