Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

నాటిన మొక్కలను సంరక్షించడం మరింత ముఖ్యం: పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌.

25-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రతి విద్యార్థి పుట్టినరోజున మొక్క నాటాలి.

రంగారెడ్డి, ఆగస్టు 25:

వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ వినయ్‌కుమార్‌ ఐఎఫ్‌ఎస్‌ పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా MJPTBCWREIS బాలుర పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో భాగంగా MJPTBCWREIS ప్రాంగణంలో 2,200 మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు.

మొక్కలు నాటడం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి విద్యార్థి పుట్టినరోజున కనీసం ఒక మొక్క నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం వాటిని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించాలని అన్నారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో చార్మినార్‌ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ డా. ప్రియాంక వర్గీస్‌ ఐఎఫ్‌ఎస్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కె.చంద్రారెడ్డి, జిల్లా అటవీ అధికారి శివ్‌ ఆశీష్‌ సింగ్‌ ఐఎఫ్‌ఎస్‌, పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నాటిన మొక్కలను సంరక్షించడం మరింత ముఖ్యం: పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News