Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి: డీఐఈఓ సురేష్‌రెడ్డి

25-08-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సురేష్‌రెడ్డి సూచించారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధి, విద్యాభివృద్ధితోపాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించడంతోపాటు ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. సిగరెట్, గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ జగదీష్, లైబ్రేరియన్‌ జానయ్య, అధ్యాపకులు ప్రసన్నదేవి, పున్నారావు, మాల వెంకటరెడ్డి, ముందడి వెంకటరెడ్డి, కిరణ్, నిర్మల, కవిత, నరసింహారావు, రాజేశ్వరి, అశోక్‌కుమార్, శ్రీకాంత్, నగేష్, అశోక్‌రెడ్డి, ఉపేందర్‌రావు, కరుణ, ఉమారాణి, పరశురాం, శ్రావణ్‌కుమార్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి: డీఐఈఓ సురేష్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News