Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:22 PM

చిట్యాల ఎంపీడీఓ కార్యాలయంలో సమయపాలన గాలికి.. ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలి?

24-08-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటికి సత్వర పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికే కొందరు అధికారులు సమయపాలన పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సోమవారం చిట్యాల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు నిర్ణీత సమయానికి హాజరుకాకపోవడంతో సమస్యలు చెప్పేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించాల్సిన అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమానికే అధికారులు ఆలస్యంగా వస్తే.. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు ప్రజావాణి వంటి కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఆ కార్యక్రమం ఉద్దేశాన్నే దెబ్బతీస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

చిట్యాల ఎంపీడీఓ కార్యాలయంలో సమయపాలన గాలికి.. ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలి?

Article Image

చిట్యాల: ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటికి సత్వర పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికే కొందరు అధికారులు సమయపాలన పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సోమవారం చిట్యాల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు నిర్ణీత సమయానికి హాజరుకాకపోవడంతో సమస్యలు చెప్పేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించాల్సిన అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమానికే అధికారులు ఆలస్యంగా వస్తే.. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు ప్రజావాణి వంటి కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఆ కార్యక్రమం ఉద్దేశాన్నే దెబ్బతీస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News