Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

జై కేసారంలో ‘బాలల పరిరక్షణ కమిటీ’ ఏర్పాటు

24-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బాల్యవివాహాల నిరోధానికి కఠిన చర్యలు: సర్పంచ్ భారతమ్మ

చిన్నారుల హక్కులు, సంరక్షణ కోసమే కమిటీ: ఎం. మత్స్యగిరి

చౌటుప్పల్ మండల పరిధిలోని జై కేసారం గ్రామంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డిసీపియు) ఆధ్వర్యంలో సోమవారం 'బాలల పరిరక్షణ కమిటీ'ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీయూ సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పిల్లల రక్షణ, సంరక్షణ కోసం సర్పంచ్ చైర్మన్‌గా 14 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనాధ పిల్లలకు స్కాలర్‌షిప్ సౌకర్యం ఉందన్న ఆయన, దత్తత ప్రక్రియను చట్టబద్ధంగానే చేపట్టాలని సూచించారు. గ్రామంలో పిల్లల సమస్యలపై కమిటీలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ​గ్రామ సర్పంచ్ సమ్మిరెడ్డి భారతమ్మ మాట్లాడుతూ.. గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని, బడి మానేసిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి నెలా కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దశరథ, స్కోప్ (ఎన్ జీఓ) ప్రతినిధి నరసింహరాజు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జై కేసారంలో ‘బాలల పరిరక్షణ కమిటీ’ ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News