Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:44 AM

మహమ్మద్ ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు. చేరుపల్లి సీతారాములు

23-08-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇబ్రహీంతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని సీపీఐ(ఎం) పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీం అనారోగ్యంతో మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.

తాను రామన్నపేట డివిజన్ సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇబ్రహీం తనకు సుపరిచితుడని, అనేక ప్రజా సమస్యలను వార్తలుగా ప్రచురించారని తెలిపారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసిన ఇబ్రహీం, వార్తా అంశాలను అనేక కోణాల్లో పరిశీలించి, సంబంధిత వ్యక్తులను సంప్రదించి నిజనిర్ధారణ చేసిన తర్వాతే వార్తలు రాసేవారని పేర్కొన్నారు.

ఇబ్రహీం మృతి జిల్లా పాత్రికేయ రంగానికి తీరని లోటని సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి జర్నలిస్టు మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

మహమ్మద్ ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు. చేరుపల్లి సీతారాములు

Article Image

రామన్నపేట ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇబ్రహీంతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని సీపీఐ(ఎం) పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీం అనారోగ్యంతో మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.

తాను రామన్నపేట డివిజన్ సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇబ్రహీం తనకు సుపరిచితుడని, అనేక ప్రజా సమస్యలను వార్తలుగా ప్రచురించారని తెలిపారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసిన ఇబ్రహీం, వార్తా అంశాలను అనేక కోణాల్లో పరిశీలించి, సంబంధిత వ్యక్తులను సంప్రదించి నిజనిర్ధారణ చేసిన తర్వాతే వార్తలు రాసేవారని పేర్కొన్నారు.

ఇబ్రహీం మృతి జిల్లా పాత్రికేయ రంగానికి తీరని లోటని సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి జర్నలిస్టు మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News