Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

మాదక ద్రవ్యాలపై మీడియా అవగాహన.

మాదక ద్రవ్యాలపై మీడియా అవగాహన.

మాదక ద్రవ్యాలపై మీడియా అవగాహన.
23-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహేశ్వరం: మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతోపాటు, ఈ అంశంపై సమర్థవంతమైన వార్తా కథనాలు అందించేందుకు విలేకరులకు అవగాహన కల్పించనున్నారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 25న మహేశ్వరంలో మీడియా వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు.మహేశ్వరం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, డ్రగ్స్‌ వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాలు, ఈ అంశంపై వచ్చే వార్తలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై విలేకరులకు అవగాహన కల్పించనున్నారు. మహేశ్వరం జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి మాదక ద్రవ్యాల ప్రభావంపై వివరించనున్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ పరిస్థితిపై ‘ఈగల్‌ బృందం’ అధికారి అవగాహన కల్పిస్తారు.

వర్క్‌షాప్‌కు స్థానిక విలేకరులందరూ హాజరు కావాలని పీఐబీ హైదరాబాద్‌ కోరింది. వివరాలకు మీడియా కమ్యూనికేషన్‌ అధికారి వి.గాయత్రి (9052565123)ను సంప్రదించవచ్చు.

Sthanikam

మాదక ద్రవ్యాలపై మీడియా అవగాహన.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News