Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:44 AM

మూసీ నీటికి బదులు గోదావరి జలాలు. జల్లెల పెంటయ్య

23-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

మూసీ పరివాహక ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మూసీ నీటికి బదులుగా గోదావరి జలాలను అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య డిమాండ్‌ చేశారు. రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 29, 30, 31 తేదీల్లో పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల సాధన కోసం చేపట్టనున్న సీపీఎం జిల్లా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే మహాధర్నాకు రైతులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు బోయిని ఆనంద్, మాజీ వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్, శాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్, నాయకులు బండ జగన్మోహన్‌రెడ్డి, నేమనంది లింగయ్య, బోయిని మల్లేష్, గోగు లింగస్వామి, బోయిని రామచంద్రం, ఆవుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మూసీ నీటికి బదులు గోదావరి జలాలు. జల్లెల పెంటయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News