Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:04 PM

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

23-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సమాజ సేవకులు, శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మహంకాళి ప్రణీత్ జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలోని సేవాసమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సమితి సభ్యులు, కుటుంబ సభ్యులు, మిత్రుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం సేవాసమితిలో నూతనంగా సభ్యులుగా చేరిన వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం మాట్లాడుతూ.. మహంకాళి ప్రణీత్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. శ్రీ వాసవి సేవాసమితి ఎల్లప్పుడూ నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా నిలుస్తుందని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. సభ్యుల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు గోపారపు రాజు, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బజ్జూరి శ్రీనివాసు, సభ్యులు శ్రీరంగం రాము, పోలా లక్ష్మీనారాయణ, బుక్క రమేష్, తాటిశెట్టి హనుమంత్, మహంకాళి సోమయ్య, తల్లాడ కృష్ణమూర్తి, దేవరశెట్టి దుర్గాప్రసాద్, చందా రాజశేఖర్, శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రధాన కార్యదర్శి పబ్బా ప్రకాశరావు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు దేవరశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News