Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్పుగూడెం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:02 PM

తూర్పుగూడెం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు

23-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తుంగతుర్త మండలం తూర్పుగూడెం గ్రామంలోని చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో చెరువులో లోతైన గుంతలు తవ్వి మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అక్రమ తవ్వకాలతో చెరువులో ప్రమాదకరమైన లోతైన గుంతలు ఏర్పడుతున్నాయని, వర్షాలకు అవి నీటితో నిండితే పశువులు, గొర్రెలు, మేకలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, గ్రామస్తులు చెరువులోకి వెళ్లిన సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మట్టి తవ్వకాలకు తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఇరిగేషన్‌ శాఖ ఏఈ, డీఈలు స్పష్టం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. తవ్వకాలను నిలిపివేశామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం మట్టి తరలింపు కొనసాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేసి, లోతైన గుంతలను పూడ్చి ప్రజలు, పశువులకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Sthanikam

తూర్పుగూడెం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News