Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

నోటీసులు ఇవ్వకుండా సర్వే.. ఆర్‌డీఓకు ఫిర్యాదు

22-08-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రైవేట్ సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని వినతి

బాధితులకు ముందస్తు ప్రభుత్వ నోటీసులు ఇవ్వకుండా, ప్రైవేట్ వ్యక్తితో దౌర్జన్యంగా భూ సర్వే నిర్వహించిన సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల పరిధిలోని తంగడపల్లికి చెందిన మైలారం రాఘవేంద్ర శనివారం ఆర్‌డీఓకు ఫిర్యాదు చేశారు.

​బాధితుడి కథనం ప్రకారం.. తంగడపల్లి గ్రామ శివారులో మైలారం నరసింహ, పద్మలకు ఆరెకరాల భూమి ఉంది. వారి భూమికి ఆనుకుని ఉన్న మాదిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పొల పొరుగు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రభుత్వ నోటీసులు ఇవ్వకుండానే వెంకటరమణ అనే ప్రైవేట్ వ్యక్తి తాను ‘అసిస్టెంట్ సర్వేయర్‌’నని చెప్పుకుంటూ శనివారం పొలం వద్దకు వచ్చి హద్దురాళ్లు పాటేందుకు ప్రయత్నించారు. సమాచారం లేకుండా సర్వే చేయడంపై బాధిత రైతు ప్రశ్నించగా, ఆయనను దౌర్జన్యంగా పక్కకు నెట్టివేసి హద్దులు నాటారు.

​సమాచారం అందుకున్న రైతు కుమారుడు రాఘవేంద్ర అక్కడికి చేరుకుని అనుమతి పత్రాలు చూపించాలని నిలదీయడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అధికారులు వెంటనే స్పందించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆర్‌డీఓను వేడుకున్నారు.

Sthanikam

నోటీసులు ఇవ్వకుండా సర్వే.. ఆర్‌డీఓకు ఫిర్యాదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News