Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:45 AM

పేదల ఉన్నత విద్యకు అడ్డంకిగా జీవో 97 తక్షణమే రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వంశీ వర్ధన్‌రెడ్డి

22-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ వర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 97 అమలైతే పేద, గ్రామీణ విద్యార్థులు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా వినోద్‌ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వంశీ వర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జీవో 97పై ఇప్పటికే విద్యార్థుల్లో ఆందోళన నెలకొందన్నారు. ముఖ్యంగా గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో పెరిగే విద్యా ఖర్చులను భరించలేక కోర్సులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సాంకేతిక విద్యకు దూరమైతే పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 97ను పునఃసమీక్షించి ఉపసంహరించుకోవాలని కోరారు.

విద్యార్థుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చినట్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ శ్రావణి, జిల్లా సహాయ కార్యదర్శి చింత వెంకటేష్, మండల కార్యవర్గ సభ్యుడు చందు, నాయకులు నిఖిల్‌తో పాటు పలువురు పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల ఉన్నత విద్యకు అడ్డంకిగా జీవో 97 తక్షణమే రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వంశీ వర్ధన్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News