Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: ఇద్దరు పరిస్థితి విషమం, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

22-08-2026 230 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలోని 'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన రియాక్టర్ తీవ్ర ఒత్తిడితో ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వచ్చి పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమం, మరొక ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.రియాక్టర్ పేలుడు ధాటికి దోతిగూడెం, అంతమ్మగూడెం తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాంబు పేలినంత శబ్దానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద స్థలం వద్ద దట్టమైన పొగతో పాటు తీవ్రమైన రసాయన ఘాటు వాసనలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, భూదాన్ పోచంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.గత మూడు నెలల వ్యవధిలోనే ఈ యూనిట్‌లో రెండోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Sthanikam

'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: ఇద్దరు పరిస్థితి విషమం, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలోని 'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన రియాక్టర్ తీవ్ర ఒత్తిడితో ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వచ్చి పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమం, మరొక ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.రియాక్టర్ పేలుడు ధాటికి దోతిగూడెం, అంతమ్మగూడెం తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాంబు పేలినంత శబ్దానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద స్థలం వద్ద దట్టమైన పొగతో పాటు తీవ్రమైన రసాయన ఘాటు వాసనలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, భూదాన్ పోచంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.గత మూడు నెలల వ్యవధిలోనే ఈ యూనిట్‌లో రెండోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News