Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 AM

వెట్టి చాకిరి కుటుంబాలకు విముక్తి

వెట్టి చాకిరి కుటుంబాలకు విముక్తి

వెట్టి చాకిరి కుటుంబాలకు విముక్తి
21-08-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

అనంతపురం జిల్లా, కంబదూరు మండలంలో ఉపాధి కోసం మహారాష్ట్ర నుంచి వలస వచ్చి బలవంతపు శ్రమ, వెట్టి చాకిరీకి గురవుతున్న రెండు కుటుంబాలకు అధికారులు విముక్తి కల్పించారు. బాండెడ్ లేబర్‌ వ్యవస్థ నిర్మూలనలో భాగంగా గురువారం చేపట్టిన తనిఖీల్లో కంబదూరు మండలం కె. రాంపురం గ్రామంలో బాండెడ్ లేబర్లుగా పనిచేస్తున్న రెండు కుటుంబాలను అధికారులు గుర్తించారు. ఆర్డీవో వసంత్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు కార్మికులను సురక్షితంగా కళ్యాణదుర్గానికి తరలించారు. రెండు కుటుంబాల్లో ఆరుగురు కార్మికులు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా ఆదివాసీగాడి ప్రాంతానికి చెందిన ఈ కుటుంబాలను బొగ్గులు కాల్చే పనుల కోసం అరవింద్ సేట్ అనే వ్యక్తి ఇక్కడికి తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. రెండేళ్లుగా వారితో పనులు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బొగ్గు బస్తాకు రూ.160 చెల్లిస్తామని చెప్పి తీసుకువచ్చినప్పటికీ, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడు రోజుల పని చేసినా కేవలం రూ.600 నుంచి రూ.700 మాత్రమే చెల్లిస్తూ, కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా కార్మికుల స్వేచ్ఛను కూడా హరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు కార్మికులు ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, బాధితులను సురక్షితంగా రక్షించారు. బాధిత కార్మికులకు వెంటనే రిలీజింగ్ ఆర్డర్లు జారీ చేశారు. బాండెడ్ లేబర్ సిస్టమ్ యాక్ట్ ప్రకారం యజమానిపై కేసు నమోదు చేయించినట్లు ఆర్డీవో వసంత్ కుమార్ తెలిపారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆహారం అందించి, ఐసిడిఎస్ అధికారుల ద్వారా బాలింతకు బేబీ కిట్లు అందించామన్నారు. వారిని ప్రత్యేక వాహనంలో వారి స్వస్థలమైన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాకు సురక్షితంగా తరలించినట్లు వెల్లడించారు.

Sthanikam

వెట్టి చాకిరి కుటుంబాలకు విముక్తి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News