Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:46 AM

బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలి. రామన్నపేట కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

21-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 21: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అనుసరిస్తున్న ఏకపక్ష, అప్రజాస్వామిక, రాజకీయ పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్‌యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

రామన్నపేట కోర్టు ఆవరణలో శుక్రవారం న్యాయవాదులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీఐ ఏ రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి అనుబంధ సంస్థ కాదని, దేశంలోని న్యాయవాదులందరికీ ప్రాతినిధ్యం వహించే స్వతంత్ర చట్టబద్ధ సంస్థ అని పేర్కొన్నారు. బీసీఐ అధికారాన్ని వ్యక్తిగతంగా కేంద్రీకరించడం, అధికారిక పదవిని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం సంస్థ స్వతంత్రత, విశ్వసనీయతను దెబ్బతీస్తుందని విమర్శించారు.

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ పట్టభద్రులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయడం ఏకపక్ష, చట్టవిరుద్ధ చర్యగా ఆయన అభివర్ణించారు. కొంతమంది విద్యార్థులు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు మొత్తం బ్యాచ్‌ను శిక్షించడం రాజ్యాంగ విలువలకు, న్యాయవాదుల చట్టం–1961కు విరుద్ధమన్నారు. ఆదేశాలను అనంతరం ఉపసంహరించుకున్నప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత నుంచి చైర్మన్ తప్పించుకోలేరన్నారు.

ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్ల స్వతంత్రతలో జోక్యం చేసుకోవడం, ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులను నామినేషన్ల ద్వారా అధికార స్థానాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించడం ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధమన్నారు. న్యాయ విద్య ప్రమాణాలు, న్యాయ కళాశాలల తనిఖీలు, అనుమతులకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

బీసీఐ కోల్పోయిన గౌరవం, విశ్వసనీయత, ప్రజాస్వామిక స్వభావాన్ని పునరుద్ధరించేందుకు మనన్ కుమార్ మిశ్రా వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మామిడి వెంకట్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎల్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగతయ్య, జిల్లా కమిటీ సభ్యులు యాదాసు యాదయ్య, గడ్డం నరసింహ, వీరమల్ల నర్సింహ, అంతటి రమేష్, అంకం నరేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలి. రామన్నపేట కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News