Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

నారాయణఖేడ్‌లో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ

20-08-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథోడ్, టీపీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, రియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల బాధ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పరిశీలకులు సమావేశమై డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సమర్థవంతమైన నాయకుడిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని నాయకులు కోరారు. పార్టీ శ్రేణుల నుంచి సేకరించిన అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించి, అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని త్వరలోనే డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని పరిశీలకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ ,సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల స్థాయి అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, ఇతర అనుబంధ సంఘాల బాధ్యులు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News