Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భువనగిరి రోడ్డు టీటీడీ భూముల కబ్జాపై బీఆర్ఎస్ నేత బొబ్బిలి శివశంకర్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:28 PM

భువనగిరి రోడ్డు టీటీడీ భూముల కబ్జాపై బీఆర్ఎస్ నేత బొబ్బిలి శివశంకర్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్

07-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

టీటీడీ భూ కబ్జాపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నాయకులు*

*స్థానిక మున్సిపల్ చైర్మన్ తీరుపై తీవ్ర ఆరోపణలు*

రెఫరెండం కు సిద్ధం కావాలని సవాల్

ఇటీవల కాలంలో టీటీడీ భూమిపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంతో నిజాలు బయటపడుతుండటంతో తట్టుకోలేక స్థానిక మున్సిపల్ చైర్మన్ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేశారని, అందులో సబ్జెక్ట్ లేదని, భజగోవిందం పరమానందం అన్నట్టుగా ఉందని బీఆర్ఎస్ నాయకులు బొబ్బిలి శివశంకర్ రెడ్డి తెలిపారు. గత కొంతకాలంగా టీటీడీ కల్యాణ మండపానికి సంబంధించి జరుగుతున్న వివాదాలలో ఆ భూమి కబ్జాకు గురైందని, దీనిపై బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమాలు చేస్తూ డాక్యుమెంట్లతో సహా పూర్తి ఆధారాలను బయటపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మీడియా మరియు పత్రికా విలేకరులపై 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని అనడం విడ్డూరంగా ఉందని, ప్రజాస్వామ్యంలో నాలుగో స్థూహమైన పత్రికలను అవమానించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భువనగిరి రోడ్డులోని 12 గుంటల టీటీడీ కల్యాణ మండపం జాగ పూర్తిగా సిమెంట్ పలకలు పెట్టి కబ్జాకు గురిచేశారని తీవ్రంగా ఆరోపించారు. మున్సిపల్ పాలకమండలిలో బాధ్యులుగా ఉన్న వారి భర్తలు ఈ కబ్జా వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానికంగా లేని సమయంలో, అమెరికాలో ఉన్న సమయాన్ని చూసి ఈ కబ్జా చేశారని ఆయన ప్రశ్నించారు. శాసనమండలి చైర్మన్ వచ్చే వరకు ఎవరూ మాట్లాడవద్దని చెప్పి, మరుసటి రోజు మధ్యాహ్నం మున్సిపల్ చైర్‌పర్సన్ ఛాంబర్‌లో భూ యజమానులతో కలిసి కో ఆప్షన్ నెంబర్ భర్త, చైర్మన్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిచ్చారని ఆయన నిలదీశారు. ఎలాంటి సంబంధం లేదన్న వారు, ఆ భూమిపైకి ఎంఆర్ఓ, ఎస్సైలను భూ యజమానులను ఎందుకు పంపించారని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసినవారు తనకు మహిళలంటే గౌరవమని చెబుతూ, చైర్మన్ ప్రెస్ మీట్ లో దమ్ముంటే కనకదుర్గ అమ్మవారి గుడి ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరినట్లు తెలిపారు. తాను ఆ సవాల్‌ను స్వీకరించి నిజాలు మాట్లాడుతున్నానని చెబుతూ, తప్పు చేయకపోతే కనకదుర్గ అమ్మవారి పై ప్రమాణం చేయాలని లేదా రెఫరెండమ్‌కు సిద్ధం కావాలని ఆయన ప్రతిసవాల్ విసిరారు. గతంలో చిట్యాల మేజర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచులు కానీ, మున్సిపాలిటీగా ఏర్పడ్డాక మాజీ చైర్మన్ హయాంలో కానీ భూ కబ్జాలు జరగలేదని, కానీ ఇప్పుడు మీరు చైర్మన్ అయిన తర్వాతే కబ్జా జరిగిందని ఆరోపించారు. అలాగే ఇంతవరకు ఏ పాలకులూ చేయని విధంగా పారిశుద్ధ కార్మికులతో క్షమాపణలు చెప్పించుకున్న ఘనత మీకే దక్కిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. మున్సిపల్ కమిటీలో ఉన్న వారి భర్తలు మరియు కో-ఆప్షన్ భర్త ఈ కబ్జాలో ఉన్నారని, దీని వెనుక వారి స్వలాభం మరియు సొంత స్వార్థం దాగున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ భూమిపై ఇప్పటికైనా నిజాలు నిగ్గు తేల్చి ఇలాంటి కబ్జాలకు గురికాకుండా త్వరితగతినా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా దానిని వినియోగించాలని ఆయన కోరారు.

Sthanikam

భువనగిరి రోడ్డు టీటీడీ భూముల కబ్జాపై బీఆర్ఎస్ నేత బొబ్బిలి శివశంకర్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News