Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:01 PM

ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించాలి: గడ్డం యాదగిరి

07-08-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రామన్నపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన మోలుగురి రవిని గురువారం టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ, ప్రజలకు సత్వర, పారదర్శక, నాణ్యమైన పోలీసు సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సీఐ రవి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తూ పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని కోరారు.

నూతన బాధ్యతలను స్వీకరించిన సీఐ మోలుగురి రవి ప్రజలకు అందుబాటులో ఉంటూ చట్టం ముందు అందరూ సమానమే అనే భావనతో సేవలు అందిస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇస్కిళ్ల గ్రామ ఉపసర్పంచ్ బందెల నాగేష్, వల్లమల్ల యాదయ్య, నరసింహ, గడ్డం మచ్చగిరితో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించాలి: గడ్డం యాదగిరి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News