Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 03:27 PM

అమ్మ జ్ఞాపకార్థం.. సేవా కార్యక్రమాలు

అమ్మ జ్ఞాపకార్థం.. సేవా కార్యక్రమాలు

అమ్మ జ్ఞాపకార్థం.. సేవా కార్యక్రమాలు
24-07-2026 435 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మసీద్‌గూడెం గ్రామ సర్పంచ్ మర్రి వంశీదర్ రెడ్డి కుటుంబం

మసీద్‌గూడెం గ్రామానికి చెందిన కీ.శే. మర్రి సరస్వతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు, మసీద్‌గూడెం సర్పంచ్ మర్రి వంశీదర్ రెడ్డి, కుమార్తె మానస, అల్లుడు కార్తీక్ రెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ​తల్లి చిన్నతనంలో చదువుకున్న నేలపట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు పాఠశాల అవసరాల కోసం బీరువాను అందజేశారు. అనంతరం పెద్దకొండూర్‌లోని సాయి యాదాద్రి ఆశ్రమ వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, మరొక బీరువాను అందజేశారు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను సమాజ సేవ ద్వారా నిలుపుకోవడం అందరి బాధ్యత అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మర్రి రాంరెడ్డి, నేలపట్ల సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్, మందోళ్లగూడెం ఉపసర్పంచ్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి, పెద్దకొండూర్ మాజీ ఎంపీటీసీ బద్దం కొండల్ రెడ్డి, పెద్దకొండూర్ ఉపసర్పంచ్ పిన్నిటి శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులు పడమటి ఉమాదేవి, పడమటి బలవంత్ రెడ్డి, సుర్కంటి సురేందర్ రెడ్డి, వాకిటి శివారెడ్డి, రామిడి జంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అమ్మ జ్ఞాపకార్థం.. సేవా కార్యక్రమాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News