Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:34 PM

చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం!

28-08-2026 248 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిన్నకొండూరు దేపోని చెరువు పరిధిలో విచక్షణారహితంగా తొలగింపు

లక్షల విలువైన ప్రజా ఆస్తిపై ఆరోపణలు.. వివరాలు సేకరించిన విలేకరికి బెదిరింపులు

ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం "చెట్లు నాటండి.. పచ్చదనాన్ని పెంచండి" అని విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు దేపోని చెరువు పరిధిలో విచక్షణారహితంగా చెట్లను నరికివేస్తుండటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పంచాయతీ తీర్మానం ఉందనే పేరుతో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే రూ.లక్షల విలువైన చెట్లను తొలగించి ప్రజా ఆస్తిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు గ్రామస్తులు, పశుపోషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నరికిన కలపను ఎక్కడికి తరలించారు? ఎంత విలువైన ఆస్తి చేతులు మారింది? అనే అంశాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పంచనామా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించిన విలేకరికి ఫోన్‌లో బెదిరింపులు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మిగిలి ఉన్న చెట్లనైనా రక్షించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News