Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

20 కిలోల గంజాయి పట్టివేత: ఇద్దరి అరెస్ట్

28-08-2026 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఒడిశా నుంచి అక్రమ రవాణా

ఫ్రాంక్స్ కారు, 3 మొబైల్ ఫోన్లు సీజ్

జాతీయ రహదారి పై చౌటుప్పల్ ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్ వద్ద పోలీసులు గురువారం జరిపిన వాహనాల తనిఖీల్లో 20.360 కిలోల గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

​చౌటుప్పల్ డి.ఎస్.పి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, ఈగల్ ఫోర్స్ సహకారంతో ఎస్‌ఐ ఎస్. కృష్ణమాల్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో అనుమానాస్పదంగా వచ్చిన ఒడిశా రిజిస్ట్రేషన్ (OD02DS897) గల ఫ్రాంక్స్ కారును తనిఖీ చేయగా, డిక్కీలో బ్రౌన్ టేపుతో చుట్టిన 20 ప్యాకెట్లలో 20.360 కిలోల గంజాయి లభించింది. దీంతో గంజాయితో పాటు కారు, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.​ఈ కేసులో ఒడిశాలోని కేంద్రపారా జిల్లా రాజ్‌నగర్‌కు చెందిన త్రిలోచన్ సామంత్రా (30), సాగర్‌బాల్ (23)లను అరెస్ట్ చేశారు. ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణలో అధిక ధరకు విక్రయించేందుకు, రూ.50,000 కమిషన్ ఆశతో వీరు రవాణా చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న మిగతా నిందితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అరెస్ట్ చేసిన ఇద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

20 కిలోల గంజాయి పట్టివేత: ఇద్దరి అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News