నాగోల్.
: రక్షాబంధన్ సందర్భంగా నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసు సిబ్బంది పోలీసు అధికారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా సిబ్బందిని అభినందించిన సీఐ
నాగోల్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ మహిళా పోలీసు సిబ్బందిని అభినందించారు. రాఖీ పండుగ సందర్భంగా వారికి కానుకలు అందజేసి ఆత్మీయంగా గౌరవించారు. మహిళా సిబ్బంది పోలీసు విధుల్లో అందిస్తున్న సేవలను సీఐ ప్రశంసించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు పి.శివ నాగ ప్రసాద్, నర్సింహ, ఉమా, మమతతో పాటు మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి