Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:55 PM

సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు

28-08-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, ఎస్‌ఐ హారిక సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పోలీసులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. రాఖీలు కట్టిన మహిళలు, విద్యార్థినులకు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ రాఖీ వేడుకలు ఆప్యాయంగా సాగాయి.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, నర్సింగ్, కానిస్టేబుల్ అబ్రహం, సాయిరామ్, గీత, సువర్ణ,సరళాదేవి పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Sthanikam

సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News