Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు.. 31లోగా దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ పాండు

28-08-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం–2026 కింద కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హులైన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాండు కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో పథకానికి సంబంధించిన పోస్టర్, బ్యానర్, కరపత్రాలను జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్‌డీఏ అదనపు పీడీ సూర్యారావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా బాధితులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, గ్రేడ్–2, గ్రేడ్–3 పైలేరియా బాధితులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దివ్యాంగులకు కనీసం 40 శాతం వైకల్యం ఉండి సదరం లేదా యూడీఐడీ ధృవీకరణ అవసరమన్నారు. వితంతువులు 18 సంవత్సరాలు పైబడి, భర్త మరణ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలని, ఒంటరి మహిళలు 18 సంవత్సరాలు పైబడి భర్తతో విడిపోయి లేదా వదిలివేయబడి కనీసం ఏడాది పూర్తయి ఉండాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు పైబడిన అవివాహిత మహిళలు కూడా అర్హులన్నారు. కల్లుగీత, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు పైబడి సంబంధిత శాఖల ధృవీకరణ ఉండాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, పురపాలక కమిషనర్లు దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. అలాగే చేయూత అధికారిక వెబ్‌సైట్లోని ‘చేయూత దరఖాస్తు ఫారాలు’ ద్వారా ఫారాలను పొందవచ్చన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్, అర్హులైన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Sthanikam

చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు.. 31లోగా దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ పాండు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News