Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

రోడ్డుపై విష రసాయనాల చిందింపు

రోడ్డుపై విష రసాయనాల చిందింపు

రోడ్డుపై విష రసాయనాల చిందింపు
27-08-2026 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హానర్‌ ల్యాబ్‌ ట్యాంకర్‌ నుంచి లీకేజీ.. జాతీయ రహదారిపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు.

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం సమీపంలోని హానర్‌ ల్యాబ్‌ నుంచి బయటకు వెళ్లిన ఓ ట్యాంకర్‌ నుంచి ప్రమాదకర రసాయనాలు జాతీయ రహదారిపై చిందడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై రసాయనాలు పడటంతో పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసన వ్యాపించింది. దీంతో అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ట్యాంకర్‌ నుంచి రసాయనాలు లీకవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, కంపెనీ యాజమాన్యం తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకర రసాయనాల రవాణాలో నిబంధనలు పాటించకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

తరచూ ఇదే సమస్య..

వెలిమినేడు, చిట్యాల పరిసర ప్రాంతాల్లో రసాయనాలను తరలించే ట్యాంకర్ల కారణంగా గతంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని స్థానికులు తెలిపారు. రసాయన పరిశ్రమల నుంచి బయటకు వెళ్లే ట్యాంకర్లను అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని, రవాణాలో భద్రతా ప్రమాణాలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రోడ్డుపై రసాయనాలు చిందిన ఘటనపై అధికారులు వెంటనే స్పందించి, లీకేజీకి కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

రోడ్డుపై విష రసాయనాల చిందింపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News