Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 06:20 PM

ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దు: సిఐ వెంకట్ రెడ్డి

14-10-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బుధవారం కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు కట్ అయ్యాయని, ఆ లావాదేవీ మీది కాకపోతే ‘యస్‌’ లేదా ‘నో’ అని సమాధానం ఇవ్వాలని గుర్తుతెలియని నంబర్ నుంచి సందేశం వస్తే వెంటనే స్పందించవద్దని తెలిపారు. ఇలాంటి సందేశాల ద్వారా ప్రజలను భయపెట్టి వారి బ్యాంకు వివరాలను సేకరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఖాతాలో నగదు కట్ అయినట్లు సందేశం వస్తే బ్యాంకు అధికారిక యాప్‌లో వివరాలను పరిశీలించాలని, గుర్తుతెలియని లింకులను తెరవకూడదని, ఓటీపీలు, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోకూడదని సూచించారు. అనుమానం వస్తే బ్యాంకు అధికారిక కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని, సైబర్ మోసానికి గురై నగదు కోల్పోతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సిఐ వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు.

Sthanikam

ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దు: సిఐ వెంకట్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News