స్వచ్ఛ లక్కారం సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం 8వ వార్డులో స్థానిక కౌన్సిలర్ బద్రి గాలయ్య అధ్యక్షతన ఇంటింటికీ చెత్తబుట్టలు, మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చెత్తబుట్టలు, మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేసి మున్సిపల్ చెత్త బండిలోనే వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, స్వచ్ఛ లక్కారం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కానుగు బాలరాజ్, నందగిరి భీమయ్య, బద్రి బాలరాజ్, కానుగు పాండు, మున్సిపల్ అధికారులు రేణు కుమార్, హనుమంత ప్రసాద్, రవి, మహిళా సంఘాల నాయకురాళ్లు, వార్డు మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లక్కారంలో ఇంటింటికీ చెత్తబుట్టలు, మొక్కల పంపిణీ

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి