Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో నీరుగారుతున్న ఆర్టిఐ చట్టం: అధికారుల నిర్లక్ష్యంపై సహ కార్యకర్త జి. సంపత్ గౌడ్ ఆవేదన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 09:18 AM

యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై దాడులను అరికట్టాలి బీస్మాట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడాల జలంధర్ రెడ్డి.

13-10-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 12: ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీస్మాట్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడాల జలంధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు తగిన గౌరవం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యాబోధన చేసే ఉపాధ్యాయులే అభద్రతకు గురికావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడంతో పాటు యాజమాన్యాలు, ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించాలని జలంధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై దాడులను అరికట్టాలి బీస్మాట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడాల జలంధర్ రెడ్డి.

Article Image

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 12: ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీస్మాట్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడాల జలంధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు తగిన గౌరవం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యాబోధన చేసే ఉపాధ్యాయులే అభద్రతకు గురికావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడంతో పాటు యాజమాన్యాలు, ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించాలని జలంధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News