దేశ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని, ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలంతా ముందుకు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా సోమవారం సంగారెడ్డి పట్టణంలో ఐబీ అతిథిగృహం నుంచి పాత బస్టాండ్‌లోని అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో నిర్మలా జగ్గారెడ్డితో పాటు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ‘జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోదీ డౌన్ డౌన్, రాహుల్ గాంధీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని, బీజేపీ ప్రజల ఓటు హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లలో కూర్చోవడం సరైనది కాదన్నారు. ప్రతి కార్యకర్త కనీసం పది మందికి ఈ అంశాన్ని వివరించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ఢిల్లీకి వెళ్లగలిగినా, సంగారెడ్డిలోనే ఉండి భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమని రాహుల్ గాంధీ ప్రకటించారని, ఆయన డిమాండ్ నెరవేరే వరకు సంగారెడ్డిలోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ పోరాటానికి సంగారెడ్డి నుంచి సంపూర్ణ మద్దతు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి