Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు మునగాలలో ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 10:53 PM

విద్యాసేవకు జీవితకాల సాఫల్య పురస్కారం. దుగ్యాల రాముకు ఘన సత్కారం.

11-10-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, అక్టోబర్‌ 11 విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న విద్యావేత్త దుగ్యాల రాముకు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. శారదా ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం లక్డీకాపూల్‌లోని భగవాన్‌ మహావీర్‌ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేశారు.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌-1 ప్రొఫెసర్‌ ఎటికాల పురుషోత్తం ముఖ్య అతిథిగా హాజరై దుగ్యాల రామును శాలువాతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావేత్తల సేవలు సమాజ నిర్మాణంలో కీలకమని, నిస్వార్థంగా విద్యాసేవ అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న దుగ్యాల రాముకు ఈ పురస్కారం తగిన గుర్తింపు అని పేర్కొన్నారు. ఆయన సేవలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

పురస్కార గ్రహీత దుగ్యాల రాము మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన శారదా ఎడ్యుకేషనల్‌ సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, విద్యావేత్తలు, పలువురు మేధావులు పాల్గొని దుగ్యాల రాముకు అభినందనలు తెలిపారు.

Sthanikam

విద్యాసేవకు జీవితకాల సాఫల్య పురస్కారం. దుగ్యాల రాముకు ఘన సత్కారం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News