రూ.50 లక్షలతో వలిగొండ రోడ్డులో అత్యాధునిక వసతులతో గొర్రెల మార్కెట్ యార్డ్
ప్రారంభించిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గొర్రెల పెంపకందారులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. పాత సంతలో సరైన వసతులు లేక నానా తంటాలు పడుతున్న యాదవులు, జీవాల పెంపకందారుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన గొర్రెల, మేకల మార్కెట్ యార్డ్‌ను మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ రోడ్డు శివాలయం పక్కన సుమారు రూ. 50 లక్షల వ్యయంతో ఈ అత్యాధునిక వసతులతో కూడిన మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. చౌటుప్పల్‌లో ఇప్పటివరకు కొనసాగిన పాత సంతలో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల వ్యాపారులు, పెంపకందారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. వారి కష్టాలను తొలగించాలనే ఉద్దేశంతోనే అన్ని సౌకర్యాలతో ఈ నూతన మార్కెట్ యార్డ్‌ను నిర్మించినట్లు తెలిపారు. గొర్రెలు, మేకల క్రయవిక్రయాలు జరిపే పెంపకందారులందరూ ఈ సరికొత్త మార్కెట్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఈడుదుల మస్తాన్ బాబు యాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో గొర్రెలు, మేకల క్రయవిక్రయాల కోసం వినియోగదారులు పడుతున్న అవస్థలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ మార్కెట్ యార్డ్ అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని కొనియాడారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చౌటుప్పల్ కౌన్సిలర్ పాక చిరంజీవి, ఉమ్మడి నల్గొండ జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సహకార యూనియన్ డైరెక్టర్ బండారు నరసింహ, చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాస్, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం చౌటుప్పల్ మండల అధ్యక్షులు భీమనగొని బాలరాజు, మండల కార్యదర్శి కొండే శ్రీశైలం, మున్సిపల్ కన్వీనర్ గుణమోని ఐలయ్య, గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారీ వెంకటేశం, నాయకులు గజ్జి పాండు, జిల్లా కమిటీ సభ్యులు జనిగల యాదయ్య, బద్దుల వెంకటేశం, గడగోటి జంగయ్య, జెనిగల శ్రీశైలం, గోపనబోయిన జంగయ్య, ఈదుల హరిప్రసాద్, ఎర్రగోని ఐలయ్య, అరిగే కిష్టయ్య, బాలం శంకరయ్య, యాదవ సంఘం మండల అధ్యక్షులు చినుకని మల్లేశం యాదవ్, ఎర్రసాని విజయ్ కుమార్, నల్ల పర్వతాలు యాదవ్, గంగన్నబోయిన వెంకటేష్ యాదవ్, చినుకుని యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి